LAW = ధర్మశాస్త్రము = తోరా


శాస్త్రము
ఇంగ్లీషులో ఉన్న రకరకాల మాటలకి సమానార్ధకంగా మనం తెలుగులో శాస్త్రం అన్న ఒక్క మాట వాడతాము. ఉదాహరణకి mathematics కి బదులు గణితం, గణిత శాస్త్రం అన్న మాటలు వాడుకలో ఉన్నాయి. Physics అన్న మాటని భౌతికం అని అనం; భౌతిక శాస్త్రం అంటాం. అలాగే chemistry ని రసాయనం అనేసి ఊరుకోకుండా రసాయన శాస్త్రం అంటాం. పొతే, biology, zoology, .. వంటి మాటలలోని -logy ని కూడా మనం శాస్త్రం అనే అనువదిస్తాం. logos అన్న ధాతువు అర్థం భాష. ఇక genetics, statistics, economics అని -ics తో అంతం అయేవి ఉన్నాయి. వీటినీ మనం శాస్త్రం అనే అంటాం. Astronomy, economy మొదలైన మాటలలోని -nomy అంటే లెక్క పెట్టుకోవడం కనుక, astronomy అంటే నక్షత్రాలని లెక్క పెట్టడం, economy అంటే డబ్బుని లెక్క పెట్టడం వగైరా అర్ధాలు వస్తాయి. వీటినీ మనం ఖగోళశాస్త్రం, ఆర్థిక శాస్త్రం అనే అనువదిస్తాము.

Geography అనే మాట ఉంది. ఇక్కడ geo అంటే భూమికి సంబంధించిన అనీ graphy అంటే గియ్యటం, రాయటం అనీ అనుకుంటే geography కి భూమిని గురించి బొమ్మలు గియ్యడం అనే అర్థం స్పురిస్తుంది. దీన్ని కూడా మనం భూగోళశాస్త్రం అనే తెలిగిస్తున్నాం. శాస్త్రము అనగా సైన్సు అని ఒక అర్దము, రాయబడినది అని మరొక అర్దము కూడా చెప్పుకొనవచ్చు. ఉదాహరణకు మనము శాస్త్ర బద్దముగా అను పదానికి according to science అని అర్దము చెప్పుకొనడము చూడవచ్చు. అలాగే పురాణాలు, వేదాలు మొదలైన వాటిని అన్నింటినీ శాస్త్రాలు అని అంటారు.

పై ఉదాహరణలని బట్టి "శాస్త్రము" అన్న మాటకి బిగువైన నిర్వచనం లేదని తెలుస్తోంది కదా. ఒకానొకప్పుడు ఉండేది. ఈ మధ్య పోయింది. ఈ పరిస్థితి తెలుగులోనే కాదు, ఇంగ్లీషులో కూడా ఉంది. పొలిటికల్‌ సైన్సు, సోషల్‌ సైన్సు మొదలైన మాటలు ఈ పరిస్థితికి ఉదాహరణలు. ఈ వ్యత్యాసాలని గుర్తిస్తూ, ప్రస్తుతం పబ్బం గడవాలి కనుక, ఈ శీర్షిక కింద వచ్చే "సైన్సు" అన్న మాట యొక్క అర్థం గణిత, భౌతిక, రసాయనిక, జీవ శాస్త్రాలు, వాటిమీద ఆధారపడ్డ అనువర్తిత (applied) శాస్త్రాలకి పరిమితం చేసి, మిగిలిన వాటిని వీటితో కలబెట్టకుండా ఉంటే సందిగ్ధతకి తావు ఉండదు.

LAW = ధర్మశాస్త్రము = తోరా
యాకోబు 5 :16 మీ పాపములను ఒకనితోనొకడు ఒప్పుకొనుడి; మీరు స్వస్థతపొందునట్లు ఒకనికొరకు ఒకడు ప్రార్థనచేయుడి. నీతిమంతుని విజ్ఞాపన మనఃపూర్వకమైనదై బహుబలము గలదై యుండును.

అపొస్తలుల కార్యములు 19:18 విశ్వసించినవారు అనేకులు వచ్చి, తాము చేసినవాటిని తెలియజేసి యొప్పుకొనిరి.౹ 19మరియు మాంత్రిక విద్య అభ్యసించినవారు అనేకులు తమ పుస్తకములు తెచ్చి, అందరియెదుట వాటిని కాల్చివేసిరి.
ఏమి చేసారని ఒప్పుకోవాలి ? దేవుని పద్దతికి విరోధము గా జీవించారు గనుక ఒప్పుకోవలసి ఉన్నది.

ద్వితీయోపదేశకాండము 30:11 నేడు నేను నీ కాజ్ఞాపించు ఈ ధర్మమును గ్రహించుట నీకు కఠినమైనది కాదు, దూరమైనది కాదు.౹ 12 మనము దానిని విని గైకొనునట్లు, ఎవడు ఆకాశమునకు ఎక్కిపోయి మనయొద్దకు దాని తెచ్చును? అని నీ వనుకొనుటకు అది ఆకాశమందు ఉండునది కాదు;౹

13 మనము దాని విని గైకొనునట్లు, ఎవడు సముద్రము దాటి మన యొద్దకు దాని తెచ్చును అని నీవను కొననేల? అది సముద్రపు అద్దరి మించునది కాదు.౹

14 నీవు దాని ననుసరించుటకు ఆ మాట నీకు బహు సమీపముగా నున్నది; నీ హృదయమున నీ నోట నున్నది ద్వితీయోపదేశకాండము 4:5 నా దేవుడైన యెహోవా నా కాజ్ఞాపించినట్లు మీరు స్వాధీనపరచుకొనబోవు దేశమున మీరాచరింపవలసిన కట్టడలను విధులను మీకు నేర్పితిని.౹

6 ఈ కట్టడలన్నిటిని మీరు గైకొని అనుసరింపవలెను. వాటినిగూర్చి విను జనముల దృష్టికి అదే మీకు జ్ఞానము, అదే మీకు వివేకము. వారు చూచి–నిశ్చయముగా ఈ గొప్ప జనము జ్ఞానవివేచనలు గల జనమని చెప్పుకొందురు.౹

luke:1:37 'దేవుడు చెప్పిన యేమాటయైనను నిరర్థ కము కానేరదని ఆమెతో చెప్పెను. '

2timothy:3:16 దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడియుండునట్లు దైవావేశమువలన కలిగిన ప్రతిలేఖనమును ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పు దిద్దుటకును, నీతియందు శిక్షచేయుటకును ప్రయోజనకరమై యున్నది.

Acts: 17:11 వీరు థెస్సలొనీకలో ఉన్న వారికంటె ఘనులైయుండిరి గనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించి, పౌలును సీలయును చెప్పిన సంగతులు ఆలాగున్నవో లేవో అని ప్రతిదినమును లేఖనములు పరిశోధించుచు వచ్చిరి

Duet 5:31 అయితే నీవు ఇక్కడ నాయొద్ద నిలిచియుండుము. నీవు వారికి బోధింపవలసిన ధర్మమంతటిని, అనగా కట్టడలను విధులను నేను నీతో చెప్పెదను.

1st john 3:4 పాపముచేయు ప్రతివాడును ఆజ్ఞను అతిక్రమించును; ఆజ్ఞాతిక్రమమే పాపము

Romans 5:12 'ఇట్లుండగా ఒక మనుష్యునిద్వారా పాపమును పాపము ద్వారా మరణమును లోకములో ఏలాగు ప్రవేశించెనో, ఆలాగుననే మనుష్యులందరు పాపము చేసినందున మరణము అందరికిని సంప్రాప్తమాయెను.

రోమా 5:13 ఏలయనగా ధర్మశాస్త్రము వచ్చినదనుక పాపము లోకములో ఉండెను గాని ధర్మశాస్త్రము లేనప్పుడు పాపము ఆరోపింపబడదు రోమా 7:7, కాబట్టి యేమందుము? ధర్మశాస్త్రము పాపమాయెనా? అట్లనరాదు. ధర్మశాస్త్రమువలననే గాని పాపమనగా ఎట్టిదో నాకు తెలియకపోవును. ఆశింపవద్దని ధర్మశాస్త్రము చెప్పనియెడల దురాశయన ఎట్టిదో నాకు తెలియకపోవును.

రోమా 7:8 అయితే పాపము ఆజ్ఞను హేతువు చేసికొని7:8 లేక, ఆజ్ఞద్వారా. సకలవిధమైన దురాశలను నాయందు పుట్టించెను. ధర్మశాస్త్రము లేనప్పుడు పాపము మృతము.

యెషయా 14 :12 తేజోనక్షత్రమా, వేకువచుక్కా, నీవెట్లు ఆకాశమునుండి పడితివి? జనములను పడగొట్టిన నీవు నేలమట్టమువరకు ఎట్లు నరకబడితివి?

13 నేను ఆకాశమున కెక్కిపోయెదను దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనమును హెచ్చింతును ఉత్తరదిక్కుననున్న సభాపర్వతముమీద కూర్చుందును

14 మేఘమండలముమీది కెక్కుదును మహోన్నతునితో నన్ను సమానునిగా చేసికొందును అని నీవు మనస్సులో అనుకొంటివిగదా? 2 పేతురు 2:4 దేవదూతలు పాపము చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టక, పాతాళలోక మందలి కటిక చీకటిగల బిలములలోనికి త్రోసి, తీర్పుకు కావలిలో ఉంచబడుటకు వారిని అప్పగించెను.౹

Revalution:12:7 అంతట పరలోకమందు యుద్ధము జరిగెను. మిఖా యేలును అతని దూతలును ఆ ఘటసర్పముతో యుద్ధము చేయవలెనని యుండగా౹

ఆదికాండము 4:7-9 నీవు సత్క్రియ చేసినయెడల తలనెత్తుకొనవా? సత్క్రియ చేయనియెడల వాకిట పాపము పొంచియుండును; నీ యెడల దానికి వాంఛ కలుగును నీవు దానిని ఏలుదువనెను.౹

సత్యక్రియలు చేయమని వీరికి ఎవరు చెప్పెరు?

సత్క్రియలు మిరుటయే పాపమైతే ఇవి మొదటి నుండి వున్నాయి

8 కయీను తన తమ్ముడైన హేబెలుతో మాటలాడెను. వారు పొలములో ఉన్నప్పుడు కయీను తన తమ్ముడైన హేబెలుమీదపడి అతనిని చంపెను.౹ ఆదాము పాపం చేయుట వలన

1.మంచి చెడులును[శరీరస్వభావం]ను ఎరిగి యున్నాడు

2.భూమి శపించబడింది

౩.ఏదేను నుండి వేలివయబడినాడు

4.హవ్వ ప్రసవవేదన పడుట

5.ఆదాము చెమటోడ్చి పొలం పనిచేయుట

6.మరణం అందరికి సంప్రప్తమయను{రోమా:5:12}

9యెహోవా–నీ తమ్ముడైన హేబెలు ఎక్కడున్నాడని కయీను నడుగగా అతడు –నే నెరుగను; నా తమ్మునికి నేను కావలివాడనా అనెను.౹

10.నీ తమ్ముని రక్తం నాకు మొరపెట్టుచున్నది.

GENESIS:4:11-14 కావున నీ తమ్ముని రక్తమును నీ చేతిలోనుండి పుచ్చుకొనుటకు నోరు తెరచిన యీ నేలమీద ఉండకుండ, నీవు శపింప బడినవాడవు;౹ 12నీవు నేలను సేద్యపరుచునప్పుడు అది తన సారమును ఇక మీదట నీకియ్యదు; నీవు భూమిమీద దిగులు పడుచు దేశదిమ్మరివై యుందువనెను.౹

13.అందుకు కయీను –నా దోషశిక్ష నేను భరింపలేనంత గొప్పది.౹ 14నేడు ఈ ప్రదేశమునుండి నన్ను వెళ్లగొట్టితివి; నీ సన్నిధికి రాకుండ వెలివేయబడి దిగులుపడుచు భూమిమీద దేశదిమ్మరినై యుందును. కావున నన్ను కనుగొనువాడెవడోవాడు నన్ను చంపునని యెహోవాతో అనెను.౹ దోషశిక్ష ఎక్కడిది?

దేవుడు ఎవరిని’ అర్పణ అర్పించమని చెప్పలేదు ఇప్పటికి

IMP:కైయిను పాపము చేయగా వచ్చిన శిక్ష ఎవ్వరికి రాలేదు?

ఆదికాండము 5:21-24 హనోకు అరువదియైదేండ్లు బ్రదికి మెతూషెలను కనెను.౹

22 హనోకు మెతూషెలను కనిన తరువాత మూడు వందలయేండ్లు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనెను.౹

దేవుని తో నడుచుట అనగా? ధర్మశాస్త్రనుసారముగా నడుచుతయే!

23 హనోకు దినములన్నియు మూడువందల అరువదియైదేండ్లు.౹

24 హనోకు దేవునితో నడిచిన తరువాత దేవుడతని తీసికొనిపోయెను గనుక అతడు లేకపోయెను.

JOHN:14”:6 యేసు –నేనే మార్గమును, సత్యమును, జీవమును; నా ద్వారానే తప్ప యెవడును తండ్రియొద్దకు రాడు.

కీర్తనలు 37:31 వారి దేవుని ధర్మశాస్త్రము వారి హృదయములో నున్నది వారి అడుగులు జారవు.

1 యోహాను 2:5-6 ఆయన వాక్యము ఎవడు గైకొనునో వానిలో దేవుని ప్రేమ నిజముగా పరిపూర్ణమాయెను; ఆయనయందు నిలిచియున్నవాడనని చెప్పుకొనువాడు ఆయన ఏలాగు నడుచుకొనెనో ఆలాగే తానును నడుచు కొన బద్ధుడైయున్నాడు. మనమాయనయందున్నామని దీనివలన తెలిసికొనుచున్నాము.

ఆదికాండము 6:9 నోవహు వంశావళి యిదే. నోవహు నీతిపరుడును తన తరములో నిందారహితుడునై యుండెను. నోవహు దేవునితోకూడ నడచినవాడు.౹

ఆదికాండము 6: 11 భూలోకము దేవుని సన్నిధిని చెడిపోయియుండెను; భూలోకము బలాత్కారముతో నిండియుండెను

కీర్తనలు 119:53 నీ ధర్మశాస్త్రమును విడిచి నడుచుచున్న భక్తిహీనులను చూడగా నాకు అధిక రోషము పుట్టుచున్నది

కీర్తనలు 119: 85 నీ ధర్మశాస్త్రము ననుసరింపని గర్విష్ఠులు నన్ను చిక్కించుకొనుటకై గుంటలు త్రవ్విరి

ఆదికాండము 6: 5-7 నరుల చెడు తనము భూమిమీద గొప్పదనియు, వారి హృదయముయొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడు కేవలము చెడ్డదనియు యెహోవా చూచి

6 తాను భూమిమీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నొంది తన హృదయములో నొచ్చుకొనెను.౹

7 అప్పుడు యెహోవా–నేను సృజించిన నరులును నరులతోకూడ జంతువులును పురుగులును ఆకాశ పక్ష్యాదులును భూమిమీద నుండకుండ తుడిచివేయుదును; ఏలయనగా నేను వారిని సృష్టించినం దుకు సంతాపము నొందియున్నాననెను.

IMP:తుడిచివేయుదును అంటే శిక్షించాలని తలంచెను

ఆదికాండము 8:2 అగాధ జలముల ఊటలును ఆకాశపు తూములును మూయబడెను; ఆకాశమునుండి కురియుచున్న ప్రచండ వర్షము నిలిచి పోయెను{శిక్షవిదించెను}

ఆదికాండము 7:1-5 యెహోవా–ఈ తరమువారిలో నీవే నా యెదుట నీతిమంతుడవై యుండుట చూచితిని గనుక నీవును నీ యింటివారును ఓడలో ప్రవేశించుడి.౹

2 పవిత్ర జంతువులలో ప్రతి జాతి పోతులు ఏడును పెంటులు ఏడును, పవిత్రములు కాని జంతువులలో ప్రతి జాతి పోతును పెంటియు రెండును

3 ఆకాశపక్షులలో ప్రతి జాతి మగవి యేడును ఆడువి యేడును, నీవు భూమి అంతటిమీద సంతతిని జీవముతో కాపాడునట్లు నీయొద్ద ఉంచుకొనుము;౹

4 ఎందు కనగా ఇంకను ఏడు దినములకు నేను నలుబది పగళ్లును నలుబది రాత్రులును భూమిమీద వర్షము కురిపించి, నేను చేసిన సమస్త జీవరాసులను భూమిమీద ఉండకుండ తుడిచివేయుదునని నోవహుతో చెప్పెను.౹

5 తనకు యెహోవా ఆజ్ఞాపించిన ప్రకారము నోవహు యావత్తు చేసెను.

ఆదికాండము 18:20 మరియు యెహోవా–సొదొమ గొమొఱ్ఱాలనుగూర్చిన మొర గొప్పది గనుకను వాటి పాపము బహు భారమైనది గనుకను IMP:పాపమును నిర్ధారించుటకు ధర్మశాస్త్రము అవసరమై యున్నది

2 నా ప్రభువులారా, దయచేసి మీ దాసుని యింటికి వచ్చి రాత్రి వెళ్లబుచ్చి కాళ్లు కడుగుకొనుడి, మీరు పెందలకడ లేచి మీ త్రోవను వెళ్లవచ్చుననెను. అందుకు వారు–ఆలాగు కాదు, నడివీధిలో రాత్రి వెళ్లబుచ్చెదమని చెప్పిరి.౹

3 అయినను అతడు మిక్కిలి బలవంతము చేసినప్పుడు వారు అతనితట్టు తిరిగి అతని యింట ప్రవేశించిరి. అతడు వారికి విందుచేసి పొంగని రొట్టెలు కాల్చగా వారు భోజనముచేసిరి.౹

IMP:4వారు పండుకొనక ముందు ఆ పట్టణస్థులు, అనగా సొదొమ మనుష్యులు, బాలురును వృద్ధులును ప్రజలందరును నలుదిక్కులనుండి కూడివచ్చి ఆ యిల్లు చుట్టవేసి

5 లోతును పిలిచి–ఈ రాత్రి నీ యొద్దకు వచ్చిన మనుష్యులు ఎక్కడ? మేము వారిని కూడునట్లు మా యొద్దకు వారిని వెలుపలికి తీసికొని రమ్మని అతనితో చెప్పగా

6 లోతు వెలుపల ద్వారము నొద్దనున్న వారి దగ్గరకు వెళ్లి తన వెనుక తలుపువేసి

IMP:7– అన్నలారా, ఇంత పాతకము కట్టుకొనకుడి;౹

8 ఇదిగో పురుషుని కూడని యిద్దరు కుమార్తెలు నాకున్నారు. సెల వైతే వారిని మీ యొద్దకు వెలుపలికి తీసికొని వచ్చెదను, వారిని మీ మనస్సు వచ్చినట్లు చేయుడి.౹

9 ఈ మనుష్యులు నా యింటినీడకు వచ్చియున్నారు గనుక వారిని మీరేమి చేయకూడదని చెప్పినప్పుడు వారు–నీవు అవతలికి పొమ్మనిరి. మరియు వారు–వీడెవడో మనలోనికి పరదేశిగావచ్చి తీర్పరిగానుండ చూచుచున్నాడు; కాగా వారికంటె నీకు ఎక్కువ కీడు చేసెదమని చెప్పి లోతు అను ఆ మనుష్యునిమీద దొమ్మిగాపడి తలుపు పగులగొట్టుటకు సమీపించిరి.౹

ఆదికాండము 19:24-25 అప్పుడు యెహోవా సొదొమమీదను గొమొఱ్ఱామీదను యెహోవాయొద్ద నుండి గంధకమును అగ్నిని ఆకాశమునుండి కురిపించి

25 ఆ పట్టణములను ఆ మైదానమంతటిని ఆ పట్టణములలో నివసించినవారినందరిని నేల మొలకలను నాశనము చేసెను.౹ -> IMP:సోదోమ గోమోర లను శిక్షించెను !

ఆదికాండము 26:5 ఏలయనగా అబ్రాహాము నా మాట విని నేను విధించిన దాని నా ఆజ్ఞలను నా కట్టడలను నా నియమములను గైకొనెనని చెప్పెను.{IN ENGLISH-LAWS}

ఆదికాండము 39:9 నీవు అతని భార్యవైనందున నిన్ను తప్ప మరి దేనిని నా కప్ప గింపక యుండలేదు. కాబట్టి నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా పాపము కట్టు కొందునని తన యజమానుని భార్యతో అనెను.

కీర్తనలు 37:31 వారి దేవుని ధర్మశాస్త్రము వారి హృదయములో నున్నది వారి అడుగులు జారవు.

మనుష్యులు వేటి విషయంలో తప్పిపోవుచున్నారో,వేటి విషయంలో పాస్ అవుతున్నారోవాటినే వ్రాఇంచాడు .

నిర్గమకాండము 5:1 తరువాత మోషే అహరోనులు వచ్చి ఫరోనుచూచి–ఇశ్రాయేలీయులదేవుడైన యెహోవా–అరణ్యములో నాకు ఉత్సవము చేయుటకు నా జనమును పోనిమ్మని ఆజ్ఞాపించుచున్నాడనిరి.౹

నిర్గమకాండము 10:9 అందుకు మోషే–మేము యెహోవాకు పండుగ ఆచరింపవలెను గనుక మా కుమారులను మా కుమార్తెలను మా మందలను మా పశువులను వెంటబెట్టుకొని మా పిన్న పెద్దలతోకూడ వెళ్లెదమనెను.౹

నిర్గమకాండము 3: 18 వారు నీ మాట విందురు గనుక నీవును ఇశ్రాయేలీయుల పెద్దలును ఐగుప్తు రాజునొద్దకు వెళ్లి అతని చూచి–హెబ్రీ యులదేవుడైన యెహోవా మాకు ప్రత్యక్షమాయెను గనుక మేము అరణ్యమునకు మూడుదినముల ప్రయాణమంత దూరము పోయి మా దేవుడైన యెహోవాకు బలిని సమర్పించుదుము సెలవిమ్మని అతనితో చెప్పవలెను.౹

నిర్గమకాండము 12:1-2 మోషే అహరోనులు ఐగుప్తుదేశములో ఉండగా యెహోవావారితో ఈలాగు సెలవిచ్చెను

2 నెలలలో ఈ నెల మీకు మొదటిది, యిది మీ సంవత్సరమునకు మొదటి నెల.౹

నిర్గమకాండము 13:9 యెహోవా ధర్మశాస్త్రము నీ నోట నుండునట్లు బలమైన చేతితో యెహోవా ఐగుప్తులోనుండి నిన్ను బయటికి రప్పించెననుటకు, ఈ ఆచారము నీ చేతిమీద నీకు సూచనగాను నీ కన్నులమధ్య జ్ఞాపకార్థముగా ఉండును.

నిర్గమకాండము 16:4 యెహోవా మోషేను చూచి–ఇదిగో నేను ఆకాశము నుండి మీ కొరకు ఆహారమును కురిపించెదను; వారు నా ధర్మశాస్త్రము ననుసరించి నడుతురో లేదో అని నేను వారిని పరీక్షించునట్లు ఈ ప్రజలు వెళ్లి ఏనాటి బత్తెము ఆనాడే కూర్చుకొనవలెను.౹

నిర్గమకాండము 16:28 మీరు ఎన్నాళ్లవరకు నా ఆజ్ఞలను నా ధర్మశాస్త్రమును అనుసరించి నడువనొల్లరు?

నిర్గమకాండము 18: 20 నీవు వారికి ఆయన కట్టడలను ధర్మశాస్త్రవిధులను బోధించి, వారు నడవవలసిన త్రోవను వారు చేయవలసిన కార్యములను వారికి తెలుపవలెను.౹

నిర్గమకాండము 20:1-24:12 అప్పుడు యవే మోషే తో ఇట్లనెను నివు కొండ ఎక్కి న యొద్దకు వచ్చి అచట నుండుము;నివు వారికీ బోదించునట్లు నేను వ్రాసిన అజ్ఞలను ధర్మశాస్త్రమును రాతి పలకలను నికిచేదననగా

నిర్గమకాండము 23:14 సంవత్సరమునకు మూడుమారులు నాకు పండుగ ఆచరింపవలెను.౹

నిర్గమకాండము 24:1-11 మరియు ఆయన మోషేతో ఇట్లనెను–నీవును, అహరోనును, నాదాబును, అబీహును, ఇశ్రాయేలీయుల పెద్దలలో డెబ్బదిమందియు యెహోవా యొద్దకు ఎక్కి వచ్చి దూరమున సాగిలపడుడి.౹

2 మోషే మాత్రము యెహోవాను సమీపింపవలెను, వారు సమీపింపకూడదు, ప్రజలు అతనితో ఎక్కి రాకూడదు.౹

IMP:3మోషే వచ్చి యెహోవా మాటలన్నిటిని విధులన్నిటిని ప్రజలతో వివరించి చెప్పెను. ప్రజలందరు–యెహోవా చెప్పిన మాట లన్నిటి ప్రకారము చేసెదమని యేకశబ్దముతో ఉత్తర మిచ్చిరి.౹

4 మరియు మోషే యెహోవా మాటలన్నిటిని వ్రాసి ఉదయమందు లేచి ఆ కొండ దిగువను బలిపీఠమును ఇశ్రాయేలు పండ్రెండు గోత్రముల చొప్పున పండ్రెండు స్తంభములను కట్టి

5 ఇశ్రాయేలీయులలో యౌవనస్థులను పంపగా వారు దహనబలులనర్పించి యెహోవాకు సమాధానబలులగా కోడెలను వధించిరి.౹

6 అప్పుడు మోషే వాటి రక్తములో సగము తీసికొని పళ్లెములలో పోసి ఆ రక్తములో సగము బలిపీఠముమీద ప్రోక్షించెను.౹

7 అతడు నిబంధన గ్రంథమును తీసికొని ప్రజలకు వినిపింపగా వారు –యెహోవా చెప్పినవన్నియు చేయుచు విధేయులమై యుందుమనిరి.౹

IMP:8అప్పుడు మోషే రక్తమును తీసికొని ప్రజలమీద ప్రోక్షించి–ఇదిగో యీ సంగతులన్నిటి విషయమై యెహోవా మీతో చేసిన నిబంధన రక్తము ఇదే అని చెప్పెను.౹

9 తరువాత మోషే అహరోను నాదాబు అబీహు ఇశ్రాయేలీయుల పెద్దలలో డెబ్బదిమందియు ఎక్కి పోయి 10 ఇశ్రాయేలీయుల దేవుని చూచిరి. ఆయన పాదములక్రింద నిగనిగలాడు నీలమయమైన వస్తువువంటిదియు ఆకాశమండలపు తేజమువంటిదియు ఉండెను.౹

11 ఆయన ఇశ్రాయేలీయులలోని ప్రధానులకు ఏ హానియు చేయలేదు; వారు దేవుని చూచి అన్నపానములు పుచ్చుకొనిరి.

2 కొరింథీయులకు 3:14 మరియు వారి మనస్సులు కఠినములాయెను గనుక నేటివరకును పాతనిబంధన చదువబడునప్పుడు, అది క్రీస్తునందు కొట్టివేయబడెనని వారికి తేటపరచబడక, ఆ ముసుకే నిలిచియున్నది.౹

15 నేటివరకును మోషే గ్రంథము వారు చదువునప్పుడెల్ల ముసుకు వారి హృదయములమీదనున్నది గాని౹

16 వారి హృదయము ప్రభువువైపునకు ఎప్పుడు తిరుగునో అప్పుడు ముసుకు తీసివేయబడును.

నిర్గమకాండము 24:12 అప్పుడు యెహోవా మోషేతో ఇట్లనెను–నీవు కొండయెక్కి నాయొద్దకు వచ్చి అచ్చటనుండుము; నీవు వారికి బోధించునట్లు నేను వ్రాసిన ఆజ్ఞలను, ధర్మశాస్త్రమును, రాతిపలకలను నీకిచ్చెదననగా

నిర్గమకాండము 31:18 మరియు ఆయన సీనాయి కొండమీద మోషేతో మాటలాడుట చాలించిన తరువాత ఆయన తన శాసనములుగల రెండు పలకలను, అనగా దేవుని వ్రేలితో వ్రాయబడిన రాతి పలకలను అతనికిచ్చెను.

నిర్గమకాండము 32:15-19 మోషే శాసనములుగల రెండు పలకలను చేతపట్టుకొని కొండ దిగి వచ్చెను. ఆ పలకలు ఇరు ప్రక్కలను వ్రాయబడినవి; అవి ఈ ప్రక్కను ఆ ప్రక్కను వ్రాయ బడియుండెను.౹

16 ఆ పలకలు దేవుడు చేసినవి; ఆ పలకలమీద చెక్కబడిన వ్రాత దేవుని చేవ్రాత.౹

17 ఆ ప్రజలు పెద్దకేకలు వేయుచుండగా యెహోషువ ఆ ధ్వని విని–పాళెములో యుద్ధధ్వని అని మోషేతో అనగా

18 అతడు–అది జయధ్వనికాదు, అపజయధ్వనికాదు, సంగీత ధ్వని నాకు వినబడుచున్నదనెను.౹

19 అతడు పాళెమునకు సమీపింపగా, ఆ దూడను, వారు నాట్యమాడుటను చూచెను. అందుకు మోషే కోపము మండెను; అతడు కొండదిగువను తన చేతులలోనుండి ఆ పలకలను పడవేసి వాటిని పగులగొట్టెను.౹

నిర్గమకాండము 34:27-28 మరియు యెహోవా మోషేతో ఇట్లనెను–ఈ వాక్యములను వ్రాసికొనుము; ఏలయనగా ఈ వాక్యములనుబట్టి నేను నీతోను ఇశ్రాయేలీయులతోను నిబంధన చేసియున్నాను.౹

28 అతడు నలుబది రేయింబగళ్లు యెహోవాతోకూడ అక్కడ నుండెను. అతడు భోజనము చేయలేదు నీళ్లు త్రాగలేదు; అంతలో ఆయన ఆ నిబంధన వాక్యములను అనగా పది ఆజ్ఞలను ఆ పలకలమీద వ్రాసెను.

మోషే ధర్మశాస్త్రము=ప్రభువు{దేవుని} ధర్మశాస్త్రము

2 దినవృత్తాంతములు 17: 9 వారు యెహోవా ధర్మశాస్త్రగ్రంథమును చేతపుచ్చుకొని యూదావారిమధ్య ప్రకటనచేయుచు, యూదా పట్టణములన్నిటను సంచరించుచు జనులకు బోధించిరి.౹

2 దినవృత్తాంతములు 34 :15 అప్పుడు హిల్కీయా–యెహోవామందిరమందు ధర్మశాస్త్రముగలగ్రంథము నాకు దొరికెనని శాస్త్రియగు షాఫానుతో చెప్పి ఆ గ్రంథమును షాఫానుకు అప్పగించెను.౹

నెహెమ్యా 8 :1 ఏడవ నెల రాగా ఇశ్రాయేలీయులు తమ పట్టణములలో నివాసులై యుండిరి. అప్పుడు జనులందరును ఏక మనస్కులై, నీటి గుమ్మము ఎదుటనున్న మైదానమునకు వచ్చి –యెహోవా ఇశ్రాయేలీయులకు ఆజ్ఞాపించిన మోషే ధర్మశాస్త్రగ్రంథమును తెమ్మని ఎజ్రా అను శాస్త్రితో చెప్పగా

ఎజ్రా 6 :18 మరియు వారు యెరూషలేములోనున్న దేవుని సేవ జరిపించుటకై మోషేయొక్క గ్రంథమందు వ్రాసిన దానినిబట్టి తరగతులచొప్పున యాజకులను వరుసలచొప్పున లేవీయులను నిర్ణయించిరి.

లూకా 2 :22-24 మోషే ధర్మశాస్త్రముచొప్పునవారు తమ్మును శుద్ధి చేసికొను దినములు గడచినప్పుడు –ప్రతి తొలిచూలు మగపిల్ల ప్రభువుకు ప్రతిష్ఠ చేయబడవలెను అని ప్రభువు ధర్మశాస్త్రమందు వ్రాయబడినట్టు ఆయ నను ప్రభువుకు ప్రతిష్ఠించుటకును, ప్రభువు ధర్మశాస్త్రమందు చెప్పబడినట్టు గువ్వల జతనైనను రెండు పావురపు పిల్లలనైనను బలిగా సమర్పించుటకును, వారు ఆయనను యెరూషలేమునకు తీసికొనిపోయిరి.

రోమా 7:2 భర్తగల స్త్రీ, భర్త బ్రదికియున్నంతవరకే ధర్మశాస్త్రమువలన అతనికి బద్ధురాలుగాని, భర్త చనిపోయినయెడల భర్త విషయమైన ధర్మశాస్త్రమునుండి ఆమె విడుదల పొందును

రోమా:2:7-14 సత్‌క్రియను ఓపికగాచేయుచు, మహిమను ఘనతను అక్షయతను వెదకువారికి నిత్యజీవము నిచ్చును.౹

8-9 అయితే భేదములు పుట్టించి, సత్యమునకు లోబడక దుర్నీతికి లోబడువారిమీదికి దేవుని ఉగ్రతయు రౌద్రమును వచ్చును.

దుష్క్యార్యముచేయు ప్రతిమనుష్యుని ఆత్మకు, మొదట యూదునికి గ్రీసుదేశస్థునికికూడ, శ్రమయు వేదనయు కలుగును.౹

10 సత్‌క్రియచేయు ప్రతివానికి, మొదట యూదునికి గ్రీసుదేశస్థునికికూడ, మహిమయు ఘనతయు సమాధానమును కలుగును.౹

11-12 దేవునికి పక్షపాతములేదు. ధర్మశాస్త్రములేక పాపము చేసినవారందరు ధర్మశాస్త్రము లేకయే నశించెదరు; ధర్మశాస్త్రము కలిగినవారై పాపము చేసినవారందరు ధర్మశాస్త్రానుసారముగా తీర్పు నొందుదురు.౹

13 ధర్మశాస్త్రము వినువారు దేవునిదృష్టికి నీతిమంతులు కారుగాని ధర్మశాస్త్రమును అనుసరించి ప్రవర్తించువారే నీతిమంతులుగా ఎంచబడుదురు.౹

14 ధర్మశాస్త్రములేని అన్యజనులు స్వాభావికముగా ధర్మశాస్త్రసంబంధమైన క్రియలను చేసినయెడల వారు ధర్మశాస్త్రము లేనివారైనను, తమకు తామే ధర్మశాస్త్రమైనట్టున్నారు.౹

యవే గుణములు ధర్మశాస్త్ర గుణములు
1.నీతి గలవాడు: కీర్తనలు 145: 17 యెహోవా తన మార్గములన్నిటిలో నీతిగలవాడు తన క్రియలన్నిటిలో కృపచూపువాడు

2.నేను పరిశుద్దుడను: నేను మీ దేవుడనైన యెహోవాను; నేను పరిశుద్ధుడను గనుక మీరు పరిశుద్ధులై యుండునట్లు మిమ్మును మీరు పరిశుద్ధపరచుకొనవలెను. నేలమీద ప్రాకు జీవరాసులలో దేనివలనను మిమ్మును మీరు అపవిత్ర పరచుకొనకూడదు.౹

3.సత్యవంతుడు కీర్తనలు 31 :5 నా ఆత్మను నీ చేతికప్పగించుచున్నాను యెహోవా సత్యదేవా, నన్ను విమోచించువాడవు నీవే. యోహాను 14 :6 యేసు –నేనే మార్గమును, సత్యమును, జీవమును; నా ద్వారానే తప్ప యెవడును తండ్రియొద్దకు రాడు.౹

4.సమాధానకర్త: రోమా 16 :20 సమాధాన కర్తయగు దేవుడు సాతానును మీ కాళ్లక్రింద శీఘ్రముగా చితుక త్రొక్కించును.మన ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడై యుండును గాక.

5.అయన ఆత్మయైయున్నాడు: యోహాను 4 :24 దేవుడు ఆత్మగనుక ఆయనను ఆరాధించు వారు ఆత్మతోను సత్యముతోను ఆరాధింపవలెననెను.౹

6.యవే మార్పులేని వాడు:మాలకి:౩:6 యెహోవానైన నేను మార్పులేనివాడను గనుక యాకోబు సంతతివారైన మీరు లయము కాలేదు.

7.ప్రేమస్వరూపి:1ST JOHN:4: 16 మనయెడల దేవునికి ఉన్న ప్రేమను మనమెరిగినవారమై దాని నమ్ముకొనియున్నాము; దేవుడు ప్రేమాస్వరూపియై యున్నాడు, ప్రేమయందు నిలిచి యుండువాడు దేవునియందు నిలిచియున్నాడు, దేవుడు వానియందు నిలిచియున్నాడు.౹

8.యవే జీవాత్మ: యెషయా 42 :5 ఆకాశములను సృజించి వాటిని విశాలపరచి భూమిని అందులో పుట్టిన సమస్తమును పరచి దానిమీదనున్న జనులకు ప్రాణమును దానిలో నడచువారి జీవాత్మను ఇచ్చుచున్న దేవుడైన యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు.

1.నీతి గలది: కీర్తనలు 119 :138 నీతినిబట్టియు పూర్ణ విశ్వాస్యతనుబట్టియు నీ శాసనములను నీవు నియమించితివి.

2.పరిశుద్దమైనది రోమా:7:12 కాబట్టి ధర్మశాస్త్రము పరిశుద్ధమైనది, ఆజ్ఞ కూడ పరిశుద్ధమైనదియు నీతిగలదియు ఉత్తమమైనదియునై యున్నది.

౩.నీ ఆజ్ఞేలన్నియు సత్యమైనవి: కీర్తనలు 119:151,142 యెహోవా, నీవు సమీపముగా ఉన్నావు.నీ ఆజ్ఞలన్నియు సత్యమైనవి. 142నీ నీతి శాశ్వతమైనదినీ ధర్మశాస్త్రము కేవలము సత్యము.

4.నేమ్మదిగాలది:కీర్తన119: 163,165. అబద్ధము నాకసహ్యము అది నాకు హేయము నీ ధర్మశాస్త్రము నాకు ప్రీతికరము. 165. నీ ధర్మశాస్త్రమును ప్రేమించువారికి ఎంతో నెమ్మది కలదు వారు తూలి తొట్రిల్లుటకు కారణమేమియులేదు

5.ధర్మశాస్త్రం ఆత్మసంబందమైనది:రోమా 7 :14 ధర్మశాస్త్రము ఆత్మ సంబంధమైనదని యెరుగుదుము; అయితే నేను పాపమునకు అమ్మబడి శరీరసంబంధినై యున్నాను.౹

6.శాశ్వతమైనది: కీర్తనలు 111: 7-8 ఆయన చేతికార్యములు సత్యమైనవి న్యాయమైనవి ఆయన శాసనములన్నియు నమ్మకమైనవి. 8అవి శాశ్వతముగా స్థాపింపబడియున్నవి సత్యముతోను యథార్థతతోను అవి చేయబడి యున్నవి.

7.అజ్ఞానులను అనుసరించుటయే ప్రేమ: 2యోహాను 1:6 మనమాయన ఆజ్ఞలప్రకారము నడుచుటయే ప్రేమ; మీరు మొదటనుండి వినిన ప్రకారము ప్రేమలో నడుచుకొనవలెను అనునదియే ఆ ఆజ్ఞ.౹

8.జీవమును ఊపిరి: అపొస్తలుల కార్యములు 17: 25 ఆయన అందరికిని జీవమును ఊపిరిని సమస్తమును దయచేయువాడు గనుక తనకు ఏదైనను కొదువ యున్నట్టు మనుష్యుల చేతులతో సేవింపబడువాడు కాడు.

రోమా 7:10 అప్పుడు జీవార్థమైన ఆజ్ఞ నాకు మరణార్థమైనట్టు కనబడెను.౹